కొనసాగుతున్న అమ్మకాల హోరు
వాల్స్ట్రీట్లో ఈక్విటీలపై ఒత్తిడి కొనసాగుతోంది. మూడు ప్రధాన సూచీలు కీలక స్థాయిలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి ఎస్ అండ్ పీ 500 సూచీ అంత్యంత కీలక మద్దతు స్థాయి 3900 స్థాయిని కోల్పోయింది. రానున్న త్రైమాసికంలో కంపెనీ పనితీరు మరింత క్షీణించే అవకాశముందని ఫెడ్ఎక్స్ వెల్లడించడంతో… ఆ కంపెనీ షేర్ ఇవాళ 23 శాతంపైగా నష్టపోయింది. ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో నాస్డాక్ మరో 1.78 శాతం నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.47 శాతం తగ్గింది. ఇక డౌజోన్స్ కూడా 1.20 శాతం నష్టంతో కొనసాగుతోంది. యూరో మార్కెట్లన్నీ నష్టాల్లో ముగిశాయి. జర్మనీ డాక్స్ 1.86 శాతం నష్టపోగా, యూరో స్టాక్స్ 50 సూచీ1.17 శాతం తగ్గింది. డాలర్ ఇండెక్స్ తగ్గినట్లు కన్పిస్తున్నా ఇంకా 109పైనే కొనసాగుతోంది. మరో వైపు క్రూడ్ ఇవాళ స్వల్పంగా కోలుకుంది.