రష్యా బ్యాంకుల్లో చైనా క్రెడిట్ కార్డులు!
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చైనా బాగా లబ్ది పొందుతోంది. రష్యాలో తమ కార్డుల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మాస్టర్ కార్డ్, వీసాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడిని నిరసిస్తూ రెండు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రష్యాలో ఈ కార్డులు వాడుతున్నవారు కంగుతిన్నారు. దీనికి సంబంధించి రష్యా సెంట్రల్ బ్యాంక్ ఇవాళ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. మాస్టర్ కార్డు, వీసా కార్డులు ఈనెల 9 తరవాత రష్యాలో పనిచేయమని పేర్కొంది. కస్టమర్లందరూ ఈ కార్డులు ఉపయోగించి తమ డమ్మును విత్ డ్రా చేసుకోవాలని పేర్కొంది. ఈ రెండు కార్డుల చెలామణి లేకపోవడంతో రష్యాలోని కొన్ని ఆర్థిక సంస్థలు చైనాకు చెందిన యూనియన్ పే (క్రెడిట్‌కార్డు)ను ఉపయోగిస్తున్నాయి. రష్యాలోని కొన్ని బ్యాంకులు కూడా ఆమోదిస్తున్నాయి. దాదాపు 180 దేశాల్లో యూనియన్‌పే కార్డు పనిచేస్తోందని.. అదే కార్డును రష్యా బ్యాంకులు కూడా దీన్ని వాడేందుకు ఆలోచిస్తున్నట్లు రష్యా సెంట్రల్ బ్యాంక్. త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన రానుంది. యూనియన్ పేతో పాటు సెర్ బ్యాంక్ (Sberbank), టింకాఫ్ (Tinkoff) కార్డులు కూడా రష్యాలో విరివిగా వాడుతున్నారు.