రష్యా నుంచి ఆగిన గ్యాస్ సరఫరా
రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరా ఆగింది. రష్యా నుంచి భారత్‌కు చెందిన గెయిల్‌కు అయిదు ఎల్ఎన్జీ కార్గోలు రావాల్సి ఉంది. కాని రాలేదు. ఈ విషయంలో రష్యా డీఫాల్ట్ అయిందని, న్యాయపరంగా తాము చర్యలు తీసుకుంటామని గెయిల్ అంటోంది. దీనికి ప్రత్యామ్నాయంగా గల్ఫ్, అమెరికాల నుంచి ఎల్ఎన్జీ తెప్పించుకునే ప్రయత్నాల్లో గెయిల్ ఉంది. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ గాజిప్రామ్కు సింగపూర్‌లోని అనుబంధ సంస్థ ద్వారా ఏటా 28.5 లక్షల టన్నుల ఎల్ఎన్జీ దిగుమతి చేసుకునేందుకు గెయిల్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఉన్నందున గ్యాస్ సమకూర్చలేకపోతున్నామని రష్యా అంటోంది. సాధ్యమైనంత వరకు గ్యాస్ సరఫరాకు తాము ప్రయత్నిస్తామని రష్యా పేర్కొంది. ఎల్ఎన్జీని ఇంటి గ్యాస్, విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.