For Money

Business News

మార్కెట్‌ అంచనాలను మించి…

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంటే జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌ (HUL) మార్కెట్‌ అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.85 శాతం పెరిగి రూ. 2391 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ స్టాండ్‌అలోన్‌ నికర లాభం రూ. 2289 కోట్లు. ఈ లెక్కన కూడా నికర లాభం 11 శాతం చొప్పున పెరిగింది. మార్కెట్‌ అనలిస్టులు కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ. 2191 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 13438 కోట్ల నుంచి రూ. 14331 కోట్లకు పెరిగింది. మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేసిన టర్నోవర్‌ రూ. 13486 కోట్లు. ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం వల్ల కంపెనీ మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని… అయినా చక్కటి పనితీరు కనబర్చినట్లు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతా అన్నారు. హోం కేర్‌ విభాగం 30 శాతం వృద్ధి నమోదు చేయగా, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ విభాగం 17 శాతం వృద్ధిని సాధించినట్లు ఆయన తెలిపారు. లక్స్‌, డౌ, పియర్స్‌ వంటి సబ్సుల విభాగంలో డబుల్ డిజిట్‌ వృద్ధి ఉందని, అయితే ఆహారం, రెస్టారెంట్ల రంగంలో 9 శాతం వృద్ధి సాధించినట్లు సంజీవ్‌ మెహతా తెలిపారు.