ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి
ఇంటర్ బ్యాంకింగ్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. స్పాట్ మార్కెట్లో డారల్‌కు రూపాయి విలువ 76.98కి పడింది. దేశ చరిత్రలో డాలర్‌తో రూపాయి విలువ ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి.అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌తో పాటు క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో డాలర్‌కు ఎక్కడలేని డిమాండ్ వస్తోంది. అలాగే స్టాక్ మార్కెట్లో భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా డాలర్‌కు డిమాండ్ వస్తోంది. ఇక ఫార్వర్డ్ మార్కెట్లో కూడా రూపాయి మరింత బక్కచిక్కింది. మార్చి నెల కాంట్రాక్ట్ రూ. 77.14కు పడగా, ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ. 77.80 వద్ద ట్రేడవుతోంది.