ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి రూపాయి?
భారత్‌కు డబుల్ ట్రబుల్ ప్రమాదం రూపాయి విలువకు ఎసరు తెస్తోంది. ఒకేసారి డాలర్‌తో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. గత ఏడాది నుంచి స్టాక్ మార్కెట్లో షేర్లు అమ్ముతున్న విదేశీ ఇన్వెస్టర్లు ఇపుడు ఇంకా భారీ స్థాయిలో తెగ అమ్ముతున్నారు. వీరి నుంచి కూడా డాలర్‌కు డిమాండ్ వస్తోంది. స్పాట్ మార్కెట్లో డాలర్‌కు రూపాయి రెఫెరెన్స్ రేటు రూ.76 దాటింది. ఇక ఫ్యూచర్స్ మార్కెట్లో మార్చి కాంట్రాక్ట్ రూ. 76.35, ఏప్రిల్ కాంట్రాక్ట్ రూ.76.68 వద్ద, మే కాంట్రాక్ట్ రూ. 76.95 వద్ద ట్రేడవుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం వెంటనే కొలిక్కి రాని పక్షంలో డాలర్‌తో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి పడిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకుమునుపు ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయి 76.88 2020 ఏప్రిల్ 22వ తేదీన నమోదైంది.
డాలర్ కొనాలంటే…
ఇపుడు మన దేశంలో బ్యాంకుల్లో డాలర్ కొనాలంటే భారీగానే చెల్లించాల్సి వస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డాలర్‌ను రూ. 73.99లకు కొంటోంది. అలాగే రూ. 77.97లకు అమ్ముతోంది.