For Money

Business News

రూపాయి విలవిల

 

అంతర్జాతీయ మార్కెట్‌లో కరెన్సీ మార్కెట్‌ ఇపుడు చాలా హాట్‌ మార్కెట్‌గా మారింది. డాలర్‌ దెబ్బకు అనేక దేశాల కరెన్సీ కుప్పకూలుతున్నాయి. మన విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి విలువ ఇవాళ ఓపెనింగ్‌లోనే 81.55నని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇవాళ 55 పైసలు క్షీణించింది. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి 80.99 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు తగ్గినా… డాలర్‌ దెబ్బకు పూర్తి ప్రయోజనం భారత్‌ వంటి దేశాలు పొందలేకపోతున్నాయి. పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతున్న సమయంలో రూపాయి మరింత బలహీనపడటంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇవాళ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా కీలకంగా మారనున్నాయి. అమ్మకాల జోరు కొనసాగే పక్షంలో డాలర్‌తో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశముంది.