నేటి నుంచి రుచి సోయా ఎఫ్‌పీఓ
బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి గ్రూప్ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇష్యూ ఈనెల 28న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 4300 కోట్లను సమీకరించదలచింది. బుధవారం రూ.1290 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన కంపెనీ ఇన్వెస్టర్లకు 1.98 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ. 615-రూ. 650 ధర శ్రేణితో ఆఫర్ చేయనుంది. నిన్న ఈ ఈ షేర్ ఎన్‌ఎస్‌ఈలో రూ. 896 వద్ద ముగిసింది. నిన్న దాదాపు 2 శాతం మేర ఈ షేర్ క్షీణించింది. పలు బ్రోకింగ్ సంస్థలు ఈ షేర్‌ను సబ్‌స్క్రయిబ్ చేయమనే సలహా ఇస్తున్నాయి.