For Money

Business News

మా వ్యాపారాన్ని అమ్మే ప్రసక్తే లేదు

తమ వ్యాపారాన్ని హిందుస్థాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్ (HUL)కు అమ్మేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ప్రముఖ మసాల దినుసుల బ్రాండ్‌ MDH కంపెనీ ప్రమోటర్లు ఖండించారు. అవన్నీ తప్పుడు, నిరాధార వార్తలని వారు కొట్టిపారేశారు. అలాంటి కథనాలను అమ్మవద్దని వారు కోరారు. తమ కంపెనీని HULకు అమ్మేందుకు ప్రయత్నిస్తోందని ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చాయి. ధరమ్‌పాల్‌ జి, చిమి లాల్‌జీలు తమ జీవితాంతం కష్టపడిన నిర్మించిన తమ కంపెనీని మరింత ముందుకు తీసుకెళతామని అమ్మే ప్రసక్తే లేదని ప్రమోటర్లు వివరించారు.