RBL బ్యాంకుపై రూ. 2 కోట్ల ఫైన్
కస్టమర్లకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో RBL బ్యాంకుపై ఆర్బీఐ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. చట్ట విరుద్దంగా ఖాతాలు తెరిచినట్టు తమ పరిశీలనలో తేలినట్టు ఆర్బీఐ వెల్లడించింది. కో ఆపరేటీవ్ బ్యాంక్ పేరిట అయిదు సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్లు తెరవడం, బోర్డు డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఎల్ ఉల్లంఘించినట్లు ఆర్బీఐ గుర్తించింది. మార్చి 31 2019తో ముగిసిన ఖాతాల ఇన్స్పెక్షన్ సందర్భంగా ఈ వ్యవహారలు బయటపడ్డాయి.