For Money

Business News

రూ. 6.15 లక్షల కోట్ల రుణాల రద్దు

గడచిన మూడేళ్లలో దేశంలోని ప్రభు త్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ) దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు వెల్లడించారు. ఇందులో ఒక్క ఎస్‌బీఐనే 2018-19 నుంచి 2021-22 వరకు 1,64,735 కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు ఆమె వెల్లడించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.61,763 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.59,807 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ రూ.52,655 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.37,617 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.34,281 కోట్లు, ఐడీబీఐ రూ.33,135 కోట్లు, ఐఓబీ రూ.32,586 కోట్లు, యూకో బ్యాంక్‌ రూ.30,160 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ.22,522 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ రూ.21,772 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.18,874 కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు ఆమె సభకు తెలిపారు.