For Money

Business News

విలీనానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఓకే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీల విలీనానికి స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఆమోదం తెలిపాయి. ఈ మేరకు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు సూత్రప్రాయ అనుమతి ఇచ్చినట్లు ప్రకటించాయి. ఈ విలీనానికి ఇప్పటికే ఆర్బీఐ, సెబీ, పీఎఫ్‌ఆర్‌డీఏ, కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి అనుమతి లభించింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 రెండో త్రైమాసికంకల్లా హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల విలీనం పూర్తయ్యే అవకాశముంది.