For Money

Business News

రూ. 55000 దాటిన వెంటనే…

నిన్న రాత్రి బంగారం ధర ఒక్కసారిగా వువ్వెత్తున పెరిగింది. అమెరికాలో నిన్న రాత్రి వచ్చిన వినియోగదారుల సూచీ ఊహించినదాని కన్నా తక్కువగా పెరిగిందన్న వార్తలతో రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 40 డాలర్ల మేర పెరిగి 1,832 డాలర్లకు చేరింది. తరవాత స్వల్ప ఒత్తిడి రావడంతో 1822 డాలర్లకు తగ్గింది. దీంతో మన మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో కూడా బంగారం అదే విధంగా కదలాడింది. రాత్రి పది గ్రాముల బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్‌ ధర రూ.55,000ను దాటి రూ. 55047ని తాకింది. నిన్న ఒక్క రోజే రూ.730 మేర పెరిగింది. కాని క్లోజింగ్‌కల్లా 54,774 వద్ద ముగిసింది. అలాగే రాత్రి వెండి 23.988 డాలర్లకు చేరింది. తరవాత 23.94 డాలర్లకు తగ్గింది. మన ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో మార్చి వెండి కాంట్రాక్ట్‌ రూ. 69575ని తాకింది. తరవాత స్వల్పంగా తగ్గి రూ.1084 లాభంతో రూ. 68,870 వద్ద ముగిసింది. ఇవాళ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచనుంది. ఏ మేరకు పెంచుతుందో..దాన్ని బట్టి ఇవాళ బులియన్‌ ధరలు స్పందించనున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్‌లో వచ్చిన మార్పుల అనుగుణంగా ఇవాళ భారత్‌లోని వివిధ నగరాల్లో స్పాట్‌ మార్కెట్లో బుధవారం బంగారం ధర పెరిగే అవకాశం ఉంది.