For Money

Business News

బ్రిటన్‌లోని అతి పెద్ద స్క్రీన్‌పై RRR

దేశ సినీ పరిశ్రమకు కొత్త దశ, దిశను చూపుతోంది ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ. సినిమా తీయడంలోనే కాదు.. మార్కెటింగ్‌లోకూడా ఇప్పటి వరకు ఏ మూవీకి చేయనంత స్థాయిలో ఈ సినిమాకు చేస్తున్నారు. మూసలో పడి సాగుతున్న సినిమా బిజినెస్‌ను రాజమౌళి టీమ్‌ కొత్తపుంతలు తొక్కిస్తోంది. విదేశాల్లో కూడా ఈ సినిమా… భారత సినిమా పరిశ్రమ మార్కెట్‌ను మరింత విస్తరించనుంది. దుబాయ్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ ప్రి రిలీజ్‌ ఈవెంట్ జరుగుతుందని సమాచారం. ఇక్కడే కాదు అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల అవుతున్న ప్రతిదేశంలో కూడా కొత్త మార్కెటింగ్‌ వ్యూహాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ అమలు చేస్తోంది. ఇపుడు యూరప్‌ మార్కెట్‌పై కన్నేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ లండన్‌ వాటర్లూలోని ఓడియన్ బిఎఫ్ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. బిజినెస్‌తో పాటు భారీ పబ్లిసిటీ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఇంకా అధికారికంగా ధృవీకరించకున్నా హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో ఈవార్త చక్కర్లు కొడుతోంది. బ్రిటన్‌లో దాదాపు 1000 స్ర్కీన్స్‌లో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

అంత ప్రత్యేకంగా చెప్పుకుంటున్న ఈ సినిమా థియేటర్‌ ఎలా ఉంటుందో ఓ సారి ఈ వీడియో చూడండి..