RIL: రూ.5;800 కోట్లతో ఆర్ఈసీ కొనుగోలు
నార్వేకు చెందిన సౌర ప్యానెళ్ల తయారీ సంస్థ ఆర్ఈసీ సోలార్‌ను 771 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5800 కోట్ల)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. దేశీయంగా స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్‌లో 40 శాతం వాటాను రూ.2,845 కోట్లకు కొంటున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. సోలార్ ఈపీసీ రంగంలో ఉన్న స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్ లిమిటెడ్‌ను ఎస్పీ గ్రూప్.. కుర్షిద్ యాజ్ది దారువాల కుటుంబంతో కలిసి నిర్వహిస్తోంది
రిలయన్స్‌కు చెందిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ 771 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.5,800 కోట్లు) చైనా నేషనల్ బ్లూస్టార్ (గ్రూప్) కంపెనీ ఆధ్వర్యంలో ఉన్న ఆర్ఈసీ సోలార్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆర్ఈసీకి ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్లాట్‌ఫామ్‌తో అంతర్జాతీయంగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియాల్లో విస్తరించనుంది.ఆర్ఈసీ సోలార్కు ప్రస్తుతం నార్వేలో రెండు, సింగపూ ర్లో ఒక ఉత్పత్తి యూనిట్ ఉన్నాయి. దీనికి తోడు కొత్తగా ఫ్రాన్స్, అమెరికాల్లో రెండు కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయబోతోంది. ఆర్ఈసీ కొనుగోలు ద్వారా అంత ర్జాతీయ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ రంగంలోనూ సత్తా చాటవచ్చని రిలయన్స్ భావిస్తోంది.