For Money

Business News

రైట్స్‌ ఇష్యూ ఇక చాలా ఫాస్ట్‌

నిన్న జరిగిన బోర్డు సమావేశంలో సెబి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. F&O జోలికి వెళ్ళని సెబీ బోర్డు… రైట్స్‌ ఇష్యుకు సంబంధించిన ప్రధాన అంశాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రైట్స్‌ ఇష్యూ పూర్తి అయ్యే గడువు బాగా తగ్గేలా చర్యలు తీసుకుంది. రైట్స్‌ ఇష్యూ ఆఫర్‌ లెటర్‌ను ఇప్పటి వరకు సెబి వద్ద దాఖలు చేయాల్సిన వచ్చేది. ఇక నుంచి స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద దాఖలు చేస్తే చాలు. అయితే రూ. 50 కోట్ల లోపు ఉన్న రైట్స్‌ ఇష్యూలు సెబీకి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీంతో రైట్స్‌ ఇష్యూ ఇక నుంచి 23 రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఇపుడు రైట్స్‌ ఇష్యూ పూర్తి అవడానికి 317 రోజులు పడుతోంది. అలాగే ప్రిఫెరెన్షియల్‌ ఇష్యూ కూడా 40 వర్కింగ్‌ రోజుల్లో పూర్తి అయ్యే నిబంధనలను సెబీ మార్చింది. మార్కెట్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఎఫ్‌ అండ్‌ ఓకి సంబంధించి నిన్న బోర్డులో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు.

Leave a Reply