For Money

Business News

ఆకాశమే హద్దుగా రీటైల్‌ ధరలు

రీటైల్‌ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను ఇవాళ ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్‌ నెలలో ఈ ద్రవ్యోల్బణం ఏకంగా 5.49 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. ఇది 9 నెలల గరిష్ఠ స్థాయి. గత ఏడాది బేస్‌ రేటు ఆధారంగా దీన్ని లెక్కించినట్లు పేర్కొంది. ఆర్థికవేత్తలు ఈ ద్రవ్యోల్బణం 3.6 శాతం నుంచి 5.40 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. వీరి అంచనాలను మించి రీటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగింది. దీనికి కారణం కాయగూరల ధరలు భారీగా పెరగడమే. రీటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. అయితే అందులో ఘోరంగా విఫలమైనట్లు తాజా డేటా తెలుపుతోంది. దీని పరోక్షం అర్థం.. ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గవు. ద్రవ్యోల్బణం తాను నిర్దేశించిన స్థాయికి దిగువకు వస్తేనే వడ్డీ రేట్లను తగ్గిస్తామని ఆర్బీఐ ఇది వరకే చెప్పింది.

Leave a Reply