వడ్డీ రేట్లు పెంపు
ద్రవ్యోల్బణం హద్దులు దాటుతున్నందున వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. మూడు రోజుల ఎంపీసీ సమావేశం తరవాత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడారు. వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో రెపో రేటు 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. FY27లో ప్రధాన ద్రవ్యోల్బణ రేటు 4.4 శాతం ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ద్రవ్యోల్బణం హద్దులు మీరకుండా ఉండేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందని అన్నారు. రెపో రేటు పెంచడంతో ఎంఎస్ఎఫ్ రేటును 5.75 శాతానికి పెరిగింది. FY27 ద్వితీయార్ధంలో జీడీపీ వృద్ధి రేటును 6.4 శాతం నుంచి 7.2 శాతానికి పెంచుతున్నట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.అలాగే CPI ద్రవ్యోల్బణం 5 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగే అవకాశముందని అన్నారు.
