డాలర్ దెబ్బకు పసిడి విలవిల
పెరిగిన ప్రతిసారీ బులియన్పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. క్రమంగా దేశంలో ఫ్యూచర్ మార్కెట్ ట్రేడింగ్ పెరుగుతుండటంతో… కరెన్సీ మార్కెట్ ప్రభావం అధికమౌతోంది. దీంతో స్పాట్ గోల్డ్ కంటే ఫ్యూచర్ గోల్డ్లోనే ఎక్కువ ట్రేడింగ్ జరుగుతోంది. అమెరికా డాలర్ నిన్న 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయిని దాటింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 11.45 వద్ద ట్రేడవుతోంది. ఈ ప్రభావం రాత్రి అమెరికా బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మళ్ళీ 1700 దిగువకు వచ్చింది. అమెరికా ఆర్థిక డేటా బాగుండటంతో పాటు చైనా కూడా వృద్ధి పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో వెండికి దిగువస్థాయిలో మద్దతు అందుతోంది. పారిశ్రామిక రంగంలో వెండిని బాగా వాడటమే దీనికి కారణం. అయితే బంగారంలో మాత్రం ఆసక్తి తగ్గడంతో ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1706 డాలర్ల వద్ద ఉంది. ఇక మన ఫార్వర్డ్ మార్కెట్లో రాత్రి పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర (అక్టోబర్ కాంట్రాక్ట్) రూ.50,280 వద్ద రూ.153 నష్టంతో ముగిసింది. ఇవాళ రూపాయి బలహీనపడితే బంగారం ధర కాస్త నిలకడగా ఉండొచ్చు..లేదా రూ. 50000 దిగువకు వచ్చే అవకాశముంది. ఇక వెండి ధర రాత్రి రూ.289 నష్టంతో రూ. 53101 వద్ద ముగిసింది.