For Money

Business News

రిలయన్స్‌ రీటైల్‌ చేతికి మరో బ్రాండ్‌

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ తాజాగా అబ్రహం & థాకూర్ (ఎ అండ్ టి) లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ కంపెనీలో మెజారటీ వాటా కొనుగోలు చేసింది. ఎంతకు కొనుగోలు చేసింది వెల్లడించలేదు. 1992లో డేవిడ్ అబ్రహం రాకేష్ థాకోరే ప్రారంభించిన కొద్ది కాలంలోనే కెవిన్ నిగ్లీ ఇందులో చేరారు. అతి తక్కువ కాలంలో అబ్రహం & థాకూర్(ఎ అండ్ టి) పాపులర్ బ్రాండ్’గా మారింది. భారతీయ వస్త్రాలకు సంబంధించి A&T డిజైనింగ్ లాంజ్‌వేర్, హోమ్ కలెక్షన్‌లతో ప్రారంభమైంది, వీటిని మొదట లండన్‌లోని ది కాన్రాన్ షాప్‌లో విక్రయించారు. ఫ్యాషన్ సాంస్కృతిక నిర్మాణాన్ని అర్థం చేసుకోవడంలో ముందున్న A&T బ్రాండ్ ఈ రంగంలో బలంగా పాతుకుపోయింది.