For Money

Business News

వాల్‌స్ట్రీట్‌: మళ్ళీ భారీ నష్టాలు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రమయ్యాయి. అనేక నగరాలను రష్యా దళాలు ధ్వంసం చేస్తున్నాయి. ఒక్కసారిగా డాలర్‌ భారీగా పెరిగింది. ఆకాశమే హద్దుగా క్రూడ్‌ ఆయిల్‌ పెరుగుతోంది. ఇక బులియన్‌ అదే పరిస్థితి. దీంతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తున్నాయి. డౌజోన్స్‌ ఏకంగా రెండు శాతంపైగా క్షీణించగా, నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఐఈఏతో పాటు ఒపెక్‌ కూడా ఆయిల్‌ సరఫరా పెంచుతామన్నా.. క్రూడ్‌ ఆయిల్‌ ధర 4 శాతంపైగా పెరిగింది.