రిలయన్స్ రీటైల్ చేతికి మెట్రో
మెట్రో క్యాష్ అండ్ క్యారీని రిలయన్ష్ రీటైల్ టేకోవర్ చేసింది. డీల్ విలువ రూ. 2850 కోట్లు. మొత్తం మెట్రో ఈక్విటీ రిలయన్స్ రీటైల్ చేతికి వచ్చింది. డిసెంబర్ 22వ తేదీన రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌తో మెట్రోకు చెందిన 30 లక్షల మంది బీ2బీ కస్టమర్లు రిలయన్స్ రీటైల్ చేతికి వస్తారు. వీరిలో పది లక్షల మంది పదే పదే షాపింగ్ కోసం మెట్రోకు వచ్చేవారు ఉన్నారు. 2003లో క్యాష్ అండ్ క్యారీ బిజినెస్‌తో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీకి ఇపుడు 23 నగరాల్లో 3500 మంది ఉద్యోగులు ఉన్నారు. 2021-22లో మెట్రో కంపెనీ రూ. 7700 కోట్ల టర్నోవర్ సాధించింది.