For Money

Business News

LEVELS: అధికస్థాయలో అమ్మండి

నిఫ్టి ఇవాళ వంద పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఇంకా గ్రీన్‌లో ఉన్నాయి. ఆసియా లాభాల్లో ఉంది. యూరో కూడా లాభాల్లో ప్రారంభం అవుతుందా? ఈ నేపథ్యంలో నిఫ్టిని ఏం చేయాలనే చర్చ జరుగుతోంది మార్కెట్‌లో. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 18300ని తాకే అవకాశముంది. ఎందుకంటే నిన్న నిఫ్టి18199 వద్ద ముగిసింది. నిఫ్టికి తొలి ప్రతిఘటన 18282 ఆ తరవాత 18,346 వద్ద ఎదురు కానుంది. నిఫ్టిని ఈ స్థాయిలో అమ్మడం బెటర్‌ అని సలహా ఇస్తున్నారు సీఎన్‌బీసీ ఆవాజ్‌కు చెందిన వీరేందర్‌ కుమార్‌ సలహా ఇస్తున్నారు. నిఫ్టి గనుక 18,346 లేదా 18,389ని దాటితేనే లాంగ్‌ వెళ్ళే ఆలోచన చేయాలని ఆయన పేర్కొన్నారు. అయితే పుట్‌, కాల్‌ రేషియోను చూస్తే… నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మడమే బెటర్‌ అని ఆయన చెబుతున్నారు. నిఫ్టి ఇవాళ పడితే నిన్నటి కనిష్ఠ స్థాయి అయిన 18,162ని బ్రేక్‌ చేస్తుందా అన్నది చూడండి. ఎందుకంటే ఈ స్థాయిని బ్రేక్‌ చేస్తే వెంటనే 18062ని తాకే ఛాన్స్‌
అధికంగా ఉందని వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. ఇక కాల్ రైటింగ్‌ చూస్తే 18300 ఓపెన్‌ ఇంటరెస్ట్‌ కోటి దాటింది. నిన్న 50 వేల కాంట్రాక్ట్‌లు యాడ్‌ అయ్యాయి. 18400 వద్ద కూడా ఓపెన్‌ ఇంటరెస్ట్‌ కోటి దాటింది. సో…నిఫ్టి ఈ రెండు స్థాయిలను దాటడం చాలా కష్టంగా కన్పిస్తోంది. అలాగే పుట్‌ రైటింగ్‌ విషయానికొస్తే 18000 చాలా గట్టిగా ఉంది. సో… నిఫ్టి ఇది తక్షణ మద్దతుగా కన్పించవచ్చు. సో… పై స్థాయిలో అమ్మేవారు నిన్నటి కనిష్ఠ స్థాయి వద్ద బయటపడొచ్చు. రిస్క్‌ తీసుకునేవారు మరికొంత సేపు వెయిట్‌ చేయొచ్చు. వీక్లీ డెరివేటివ్‌ క్లోజింగ్ ఉన్నందు… జాగ్రత్తగా ట్రేడ్‌ చేయడం మంచిది. తక్కువ లాభాలతో బయటపడండి.