For Money

Business News

జియో 5జీ సేవలు వచ్చేశాయి

హైదరాబాద్‌లో జియో 5జీ సేవలు నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌తోపాటు బెంగళూరులోనూ ఈ సేవలను నిన్ని నుంచే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా కస్టమర్లకు జియో వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద అన్‌లిమిటెడ్‌ 5జీ డాటాను 1జీబీపీఎస్‌ వేగంతో కంపెనీ అందిస్తోంది. దీనికి అదనంగా రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సంస్థ పలు నగరాల్లో 5 జీ సేవలను ఆరంభించింది. ఆరు నగరాల్లో 5జీ వినియోగదారుల సంఖ్య లక్ష దాటినట్లు జియో పేర్కొంది.