ఇపుడు జియో బాదుడు
ఉచితంగా సర్వీసులు ప్రారంభించి ప్రత్యర్థులను నాశనం చేశారు. ఇపుడు కస్టమర్లందరూ తన చేతికి వచ్చాక బాదుడు మొదలు పెట్టారు. ఎయిర్టెల్, వొడాఫోన్ తరవాత ఇపుడు రిలయన్స్ జియో చార్జీలను పెంచింది. ప్రత్యర్థులు చార్జీలు పెంచిన వారంలోనే జియో రేట్లు పెంచడం విశేషం. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ఇవాళ రిలయన్స్ జియో ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇక నుంచి బేసిక్ ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
తాజా రేట్ల టేబుల్ దిగువన…