For Money

Business News

రిలయన్స్‌తో ఆరామ్‌కో ఒప్పందం త్వరలో?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆయిల్ రిఫైనింగ్‌, కెమికల్స్‌ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ అరేబియా కంపెనీ ఆరామ్‌కో కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించిన డీల్‌ త్వరలోనే ఫైనల్‌ అవుతుందని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ డీల్‌ కొన్ని వారాల్లోనే కుదురుతుందని, డీల్‌ విలువ 2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల డాలర్ల మధ్య ఉండొచ్చని ఆ సంస్థ పేర్కొంది. రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదురుతుందన్న వార్త చాలా రోజుల నుంచి వస్తోంది. ఆరామ్‌కో ఛైర్మన్‌ యాసిర్‌ అల్‌ రుమయ్యాన్‌ రిలయన్స్‌లో డైరెక్టర్‌గా కూడా చేరారు.