కోలుకున్నా.. నష్టాల్లోనే
జవనరి డెరివేటివ్స్ సెషన్ నష్టాల్లో ప్రారంభమైంది. ఇవాళ నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకున్నా.. నష్టాల్లో క్లోజైంది. నాలుగు రోజుల బుల్ రన్‌కు బ్రేక్ పడింది. నిఫ్టి ఒకదశలో 21,676 పాయింట్లకు క్షీణించినా… 70 పాయింట్లకు పైగా కోలుకుని 21,731 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు కోలుకోవడంతో పాటు నిఫ్టి నెక్ట్స్ ఉదయం నుంచి పటిష్ఠంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. నిఫ్టిలో 31 షేర్లు నష్టాల్లో ముగిశాయి. సూచీలు నిలకడగా ఉన్నట్లు కన్పిస్తున్నా.. అనేక షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక షేర్ల విషయానికొస్తే నిఫ్టిలో టాటా కన్జూమర్ దాదాపు 5 శాతం లాభపడి రూ. 1089 వద్ద ముగిసింది. మూడు శాతంపైగా లాభపడి టాటా మోటార్స్ తరువాతి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గిస్తుందన్న వార్తలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు ఇవాళ బాగా నష్టపోయాయి. ఈ రంగానికి చెందిన దాదాపు అన్ని కంపెనీలు సుమారు 3 శాతం దాకా నష్టపోయాయి. నిఫ్టి బ్యాంక్‌లో ఎస్బీఐ టాప్ లూజర్‌గా నిలిచింది. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా కూడా ఒక శాతం దాకా నష్టపోయాయి. బంధన్ బ్యాంక్ నిఫ్టిలో టాప్ గెయినర్‌గా నిలిచింది. తరువాతి స్థానం ఫెడరల్ బ్యాంక్ది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇవాళ రూ. 1700 స్థాయిని దాటడం విశేషం.