రియల్టీ రుణాలు రూ.7.4 లక్షల కోట్లు
రియల్టీ రంగానికి ఇచ్చిన రుణాలలలో 67 శాతం రుణాలకు ఎలాంటి ఢోకా లేదని అనరాక్ క్యాపిటల్ తన తాజా నివేదికలో పేర్కొంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు ఈ రంగానికి 10,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.7.4 లక్షల కోట్లు) రుణాలు ఇచ్చాయి. వీటిలో 6,700 కోట్ల డాలర్ల (67 శాతం) రుణాలు సురక్షితమని అనరాక్ పేర్కొంది. మిగిలిన 33 శాతం రుణాల వసూళ్లు సమస్యాత్మకం కావొచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో 15 శాతం రుణాల ఢోకా ఉండక పోవచ్చని పేర్కొంది. అంటే మిగిలిన 18 శాతం రుణాల వసూళ్లు అనుమానమేనని తెలిపింది. బిల్డర్ల ఆర్థిక పరిస్థితి క్షీణించడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో 75 శాతం, ఎన్బీఎఫ్సీల రుణాల్లో 66 శాతం వసూళ్లకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చని తెలిపింది. రియల్టీ రంగానికి ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన రుణాల్లో 46 శాతం రుణాల వసూళ్ల కష్టంగానే ఉంటుందని స్పష్టం చేసింది.