For Money

Business News

ఆర్‌బీఎల్ బ్యాంక్ లాభం ఓకే

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్ నికర లాభం 6 శాతం పెరిగి రూ .156 కోట్లకు చేరింది. కంపెనీ ప్రొవిజన్స్‌ కేటాయింపు 30 శాతం తగ్గి రూ. 1000 కోట్ల నుంచి రూ. 424 కోట్లకు చేరాయి. బ్యాంక్‌ నిర్వహణా వ్యయం 46 శాతం పెరిగి రూ. 631 కోట్ల నుంచి రూ. 800 కోట్లకు చేరింది. బ్యాంక్‌ నికర విడ్డీ మార్జిన్‌ 4.34 శాతం ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. రుణాల వృద్ధి తగ్గడం, నిర్వహణ వ్యయాలు పెరగడమే దీనికి కారణమని బ్యాంక్‌ పేర్కొంది. అన్ని వ్యాపార విభాగాలు మెరుగైన వృద్ధిని నమోదు చేశాయని, మార్చి త్రైమాసికంతో పాటు మున్ముందు మరింత మెరుగ్గా రాణిస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఆర్‌బీఎల్ బ్యాంక్ పేర్కొంది. డిసెంబర్‌ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం పెరిగి రూ . 1010 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం రూ .570 కోట్ల నుంచి రూ .620 కోట్లకు పెరిగింది . నిర్వహణ వ్యయాలు 44 శాతం వృద్ధితో రూ .1.460 కోట్లకు చేరాయి.