For Money

Business News

పాత పెన్షన్‌ విధానం వొద్దు

పలు రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్బీఐ హెచ్చరించింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన నివేదికలో ఆర్బీఐ ఈ వ్యాఖ్యలు చేసింది. పాత పెన్షన్‌ విధానం అమలు చేయడం వల్ల భవిష్యత్‌ బాధ్యతల నుంచి ఇపుడు ప్రభుత్వాలు బయటపడుతాయని పేర్కొంది. కాని మున్ముందు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, దీని కోసం క్రమ పద్ధతిలో ఇప్పటి నుంచే నిధులు జమ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. లేనిపక్షంలో భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతాయని పేర్కొంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన చండీఘడ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానం అమల్లోకి రాగా, తాజాగా హిమాచల్‌ ప్రదేశ్‌ కూడా అదే బాటలో నడించింది. ఆప్‌ కూడా పంజాబ్‌లో పాత పెన్షన్‌ విధానం అమలు చేసే విషయాన్ని ఆలోచిస్తోంది.