For Money

Business News

డేంజర్‌ జోన్‌లో నైకా?

అన్ని రకాల చలన సగటుల దిగువన ట్రేడవుతున్న నైకా షేర్‌ ఇవాళ రూ.132.95 వద్ద ట్రేడవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ భారీగా పెరిగినా ఈ షేర్‌ ఇవాళ 5 శాతంపైగా క్షీణించింది. ఈ షేర్‌ రూ.142 లేదా రూ. 143 దాటే వరకు ఈ షేర్‌ జోలికి వెళ్ళొద్దని ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌కు చెందిన డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌, టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ రీసెర్చి హెడ్‌ సుదీప్‌ షా అన్నారు. ఆయన ఎకనామిక్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ… నైకా షేర్‌ కలిగి ఉన్న ఇన్వెస్టర్లు రూ. 130ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని సూచించారు. ఈ స్థాయి దిగువకు వెళితే ఈ షేర్‌ రూ. 120ని కూడా తాకే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎం అండ్‌ ఎం, ఎల్‌ అండ్‌ టీ షేర్లను కొనుగోలు చేయొచ్చని ఆయన అన్నారు. ఆటో రంగం నుంచి మహీంద్రా అండ్‌ మహేంద్రా షేర్‌ను కొనుగోలు చేయొచ్చని అన్నారు. ఈ షేర్‌కు రూ. 1300- రూ. 1320 ప్రాంతంలో గట్టి మద్దతు ఉందని సుదీప్‌ అన్నారు. బడ్జెట్‌కు ముందు నిఫ్టికి 17750-17800 స్థాయి అత్యంత కీలకమని ఆయన తెలిపారు.18050 వద్ద కాల్‌ రైటింగ్‌ అధికంగా ఉన్నందున… ఈ స్థాయి వద్ద నిఫ్టికి ప్రతిఘటన ఎదురు కావొచ్చని పేర్కొన్నారు. 18050ని దాటితే ర్యాలీ కొనసాగే అవకాశముందని సుదీప్‌ పేర్కొన్నారు.