For Money

Business News

ఐటీ విధానంలో మార్పులు?

రెండేళ్ళ క్రితం ప్రవేశ పెట్టిన కొత్త పన్ను విధానంలో మార్పు తేవాలని కేంద్రం భావిస్తోంది. పాత విధానం నుంచి కొత్త విధానంలోకి మారేందుకు పన్ను చెల్లింపుదారులు ఆసక్తి చూపకపోవడంతో కేంద్ర ఆర్థిక శాఖ పునరాలోచనలో పడింది. కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పన్ను మినహాయింపు పరిమితి పెంచే అంశాన్ని నార్త్‌ బ్లాక్ పరిశీలిస్తోంది. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లను తగ్గించడంతో పాటు కొత్త పన్ను స్లాబ్‌లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్‌ వార్తా ఓ కథనం రాసింది. ఆర్థిక శాఖ చేసిన ప్రతిపాదన ప్రస్తుతం ప్రధాని కార్యాలయం పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాత పన్ను విధానంలో కేవలం మూడు స్లాబ్‌లే ఉండగా.. కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్‌లు ఉన్యనాయి. కొత్త పన్ను విధానంలో ప్రస్తుతం రూ.15 లక్షలు, ఆపై ఉన్న మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఈ మొత్తాన్నీ పెంచే అవకాశం ఉందని రాయిటర్స్‌ పేర్కొంది.