For Money

Business News

గ్రీన్‌లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. నాస్‌డాక్‌లో పెద్దగా మార్పు లేదు. ఎస్‌ అండ్ పీ 500 సూచీ రెడ్‌లో ముగిసినా స్వల్ప నష్టాలే. ఇక డౌజోన్స్‌ ఏకంగా ఒక శాతంపైగా నష్టపోవడం విశేషం. ముఖ్యంగా బ్యాంకింత్‌తోపాటు ఇతర ఎకానమీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి రావడమే దీనికి ప్రధాన కారణం. డాలర్‌ స్థిరంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 102ను దాటినా… బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ 87 డాలర్ల ప్రాంతంలో ఉండటం విశేషం. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. నిన్న ఒక శాతంపైగా నష్టపోయిన జపాన్‌ నిక్కీ ఇవాళ 0.6 వాతం లాభంతో ఉంది. మిగిలిన సూచీలు గ్రీన్‌లో ఉన్నా నామమాత్రంగానే ఉన్నాయి. సింగపూర్‌ నిఫ్టి కూడా స్వల్ప లాభంతో ఉంది. ఇవాళ నిఫ్టి నిలకడగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.