For Money

Business News

వడ్డీ రేట్లకు బ్రేక్‌?

ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. తాజా డేటా ప్రకారం మన దేశంలో కూడా ధరల జోరు తగ్గుతోంది. దీంతో వరుసగా వడ్డీ రేట్లను పెంచుతున్న ఆర్బీఐ ఈసారి దానికి విరామం ప్రకటించే అవకాశముంది. వచ్చే నెలలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధానాన్ని సమీక్షించనుంది. రీటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉండటమే దీనికి ప్రధాన కారణం. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి స్పీడు తగ్గిన నేపథ్యంలో రేట్ల పెంపు వ్యూహాన్ని ఆర్బీఐ సమీక్షించుకునే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. 2022-23 మూడో త్రైమాసికంలో సీపీఐ ద్రవ్యోల్బణం సగటు 6.6 శాతంగా నమోదు కావొచ్చని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేయగా, 6.1 శాతంగానే నమోదైంది. నాలుగో త్రైమాసికంలో కూడా ద్రవ్యోల్బణం ఈ స్థాయిలోనే ఉండే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు దెబ్బతినకుండా ఆర్బీఐ సానుకూల వైఖరి ప్రదర్శించవచ్చని ఆర్థిక వేత్తలు అంటున్నారు.