మార్కెట్లపై లిక్విడి ఎఫెక్ట్ ఉంటుందా?

బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నిధులు విడుదల అయ్యేలా ఈ నెలలో దాదాపు లక్షకోట్ల రూపాయల విలువైన ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్‌ను ఈనెలలో మూడు సార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించనుంది. జనవరి నుంచి ఆర్బీఐ చర్యల వల్ల మార్కెట్‌లోకి 1.5 లక్షల కోట్ల రూపాయల లిక్విడిటీ మార్కెట్‌లోకి వచ్చింది. దాని ప్రభావం మార్కెట్‌పై ఏమాత్రం కన్పించడం లేదు. అయితే ఇటీవల ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో ఇపుడు చేసే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఏ మేరకు మార్కెట్‌పై ప్రభావం చూపుతుందో చూడాలి. రూ.50వేల కోట్లు చొప్పున రెండు విడతులగా ఈనెల 12, 18 తేదీల్లో సెక్యూరిటీస్‌ను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. అలాగే ఈ నెల 24న మరో 1000 కోట్ల డాలర్ల డాలర్ /రుపీ బై/ సెల్ స్వాప్ వేలాన్ని కూడా ఆర్‌బీఐ నిర్వహించనుంది. ఇటీవల మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించడంతో డాలర్లకు బాగా డిమాండ్ పెరిగింది. ఇటీవల డాలర్‌తో భారీగా క్షీణించిన రూపాయి… ఇపుడు నిలకడగా ఉంటుంది. రూపాయి విలువలో స్థిరత్వం సాధించేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది. అయితే ఇది ఈక్విటీ మార్కెట్లపై ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.