అయిదేళ్ళ తరవాత వడ్డీ తగ్గింపు?

దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంకు రేపు వడ్డీ రేట్లను తగ్గించనుంది. ముఖ్యంగా జీడీపీ వృద్ధి రేటు స్పీడు బాగా తగ్గడంతో కనీసం పావు శాతం మేర వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించే అవకాశముందని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. 2020 మే తరవాత ఇప్పటి వరకు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదు. వాస్తవానికి 2023 ఫిబ్రవరి తరవాత మనదేశంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. 2020 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో ఆర్బీఐ ఏడుసార్లు వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రెపో రేటు 4 వాతం నుంచి 6.5 శాతానికి చేరింది. ఆర్బీఊ ఎంపీసీ భేటీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం పది గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ తాజా క్రెడిట్ పాలసీని ప్రకటించనున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరవాత తొలిసారి సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడనున్నారు.