For Money

Business News

వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చేనా?

రేపు ఆర్బీఐ తన పరపతి విధానాన్ని ప్రకటించింది. నిన్నటి నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ నిర్వహిస్తోంది. భేటీ వివరాలను రేపు ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మీడియాకు వివరించనున్నారు. ఈసారి కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చకపోవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నందున… అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశముందని బ్యాంకర్లు కూడా అంటున్నారు. కూరగాయలు, పప్పుధాన్యాల ధరలు అధికంగా ఉండటంతో ద్రవ్యోల్బణ కంట్రోల్‌కు రావడం లేదు. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం కూడా ధరలపై ఉంటోంది. పైగా ఇపుడు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున… కఠిన నిర్ణయాలకు ప్రభుత్వం దూరంగా ఉండే అవకాశముంది. దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్ల జోలికి వెళ్ళకపోవచ్చని భావిస్తున్నారు. రెపో రేటు ఇపుడు 6.5 శాతంగా ఉంటోంది.