గోల్డ్ బాండ్- రెట్టింపు లాభం

మోడీ ప్రభుత్వం 2020లో ప్రారంభించిన గోల్డ్ బాండ్ పథకం కొనుగోలుదార్లకు కనకవర్షం కురిపించింది. 2020 ఏప్రిల్ 28వ తేదీన తొలి సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఆర్బీఐ అమ్మింది. అప్పట్లో ఒక్కో బాండ్‌ను రూ. 4,589లకు అమ్మింది. పైగా ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ కూడా ఇస్తానని హామి ఇచ్చింది. అలాగే ఇచ్చింది కూడా. అయిదేళ్ళ తరవాత ఇన్వెస్టర్లు ఆ బాండ్‌లను ఆర్బీఐకి అమ్మొచ్చని పేర్కొంది. ఇచ్చిన హామి మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి సదరు బాండ్స్‌ను కొనుగోలు చేస్తానని పేర్కొంది. ఒక్కో బాండ్‌కు రూ 9,600లు చెల్లించనున్నట్లు ఆర్బీఐ ఇవాళ పేర్కొంది. ఈ లెక్కన ఇన్వెస్టర్లకు బాండ్స్‌పైనే 109 శాతం ప్రతిఫలం దక్కినట్లయింది. పైగా ప్రతి ఏటా 2.5 శాతం వడ్డీ కూడా పొందారు. ఈ లెక్కన సావరిన్ బాండ్స్ ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాలు ఇచ్చాయన్న మాట.