రెపో రేటు పెంపు
మార్కెట్ ఊహించినట్లే వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచింది. రెపోరేటును అర శాతం పెంచింది. దీంతో కొత్త రెపో రేటు 4.40 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. సోమవారం నుంచి సమావేశమైన ఎంపీసీ (పాలసీ మానిటరింగ్ కమిటీ) ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఎంపీసీ నిర్ణయాలను మీడియాకు తెలిపారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ల కూడా 0.5 శాతం పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది.దీంతో ఈ రేట్లు 5.15 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 7.2 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 16.2 శాతం, రెండో త్రైమాసికంలో 6.2 శాతం, మూడో త్రైమాసికంలో 4.1 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.4 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ అంచాన వేస్తోంది.