For Money

Business News

అన్నింటిపై EMIలు పెరుగుతాయి… ఇవి తప్ప

ఆర్బీఐ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో మిడికల్‌ క్లాస్ కుటుంబాల కష్టాలు మరింత పెరుగుతాయి. ముఖ్యంగా కొత్తగా నివాస గృహం కొనాలని అనుకుంటున్నవారితో పాటు ఇప్పటికే హౌసింగ్‌ లోన్‌ తీసుకున్నవారికి పెద్ద షాక్‌ అని చెప్పాలి. 20 ఏళ్ళకు రూ. 30 లక్షల ఇంటిరుణం తీసుకున్నవారు ఇపుడున్న వడ్డీ రేట్ల ప్రకారం (ఎస్‌బీఐ) నెలకు రూ. 22,900 చొప్పున నెలనెలా ఈఎంఐ కడుతున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఈ ఈఎంఐ కనీసం నెలకు రూ.23620 కట్టాల్సి ఉంటుంది. అంటే రూ. 720 పెరుగుతుందన్నమాట. కాని బ్యాంకులను బట్టి ఇది మారుతుంది. ఇతర బ్యాంకుల్లో EMI మరింత పెరిగే అవకాశముంటుంది. ఆర్బీఐ నిర్ణయం వల్ల వీరిపై అధిక భారం పడనుంది. అదే పర్సనల్‌, కారు లోన్లు ఇప్పటికే తీసుకున్నవారు మాత్రం ఈ తాజా పెంపు నుంచి ఊరట లభించినట్లే. ఎందుకంటే ఇంటి రుణాలు చాలా వరకు ఫ్లోటింగ్‌ రేటుపై ఇస్తారు. అలాగే వడ్డీ రేటు పెరిగినపుడు ఈఎంఐ పెంచకుండా… రుణ కాలం పెంచుకునే వీలుంటుంది. కాని 60 ఏళ్ళు దాటినవారికి ఈ ఆఫర్‌ ఇచ్చేందుకు బ్యాంకులు ససేమిరా అంటాయి. పర్సనల్‌, కారు లోన్లు మాత్రం ఫిక్సెడ్‌ వడ్డీ రేటుపై ఇస్తారు కాబట్టి… వీరి EMI పెరగదు. సో.. కారు, పర్సనల్‌ లోను తీసుకోవాలని అనుకునేవారు ఇపుడే బ్యాంకులను సంప్రదించుకోవడం మంచిది. ఎందుకంటే బ్యాంకులు వెంటనే వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు. వారం లేదా రెండు వారాల తరవాత పెంచే అవకాశముంది.