For Money

Business News

రేట్‌ గెయిన్‌ లిస్టింగ్‌:15 శాతం నష్టం

ట్రావెల్‌, హాస్పిటల్‌ రంగానికి సొల్యూషన్స్ అందించే సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కంపెనీ రేట్‌గెయిన్‌ ట్రావెల్‌ టెక్నాలజీస్‌ లిస్టింగ్‌ రోజు నిరుత్సాహపర్చింది. ఈ షేర్‌ను కంపెనీ రూ. 425లకు కేటాయించగా, ఎన్‌ఎస్‌ఈలో రూ. 364.80 వద్ద అంటే 15 శాతం డిస్కౌంట్‌ వద్ద లిస్టయింది. ఆ తరవాత ఇంకా అమ్మకాల ఒత్తిడి రావంతో 20 శాతం నష్టంతో రూ. 340.25కు పడిపోయింది. ఇపుడు స్వల్పంగా కోలుకుని రూ. 348 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు పేటీఎంకు ఇంకా నష్టాల బెడద తప్పలేదు. ఇవాళ దాదాపు అయిదు శాతం క్షీణించి రూ. 1,334 వద్ద ట్రేడవుతోంది.