హైదరాబాద్‌లో ర్యాపిడ్ EV చార్జింగ్ యూనిట్!
ఎలక్ట్రిక్ చార్జర్లు, అందుకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీ సంస్థ ర్యాపిడ్ ఈవీ చార్జ్ (RapidEVChargE).. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహన చార్జర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ప్రస్తుతం కోయంబత్తూరులో ఉన్న ప్లాంట్‌లో చార్జర్లు తయారవుతున్నాయని, వీటికి డిమాండ్ అధికంగా ఉండటంతో ఫ్రాంచైజ్ పద్దతిన ఉత్పత్తి చేయడం అంత సులువుకాదని కంపెనీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీ శివసుబ్రమణియం తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిన్నర లోగా వెయ్యి చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.40 వేల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుందని ఆయన వెల్లడించారు. వీటి ఇన్స్టలేషన్ ఖర్చులు ఆపరేటర్ భరించాల్సి ఉంటుంది. 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని, చార్జింగ్ టారిఫ్‌ను రూ.8 నుంచి రూ.25 మధ్యలో నిర్ణయించింది. యాప్‌తో స్లాట్ బుకింగ్‌తోపాటు చెల్లింపులు జరుపవచ్చు.