For Money

Business News

రూ. 2,000 కోట్ల గేమ్‌ మొదలైంది…

ఉదయం నుంచే దేశంలోని అన్ని థియేటర్లు హౌస్‌ ఫుల్‌. విదేశాల్లో కూడా అదే టైప్‌ రెస్సాన్స్‌. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా 59,000 స్క్రీన్స్‌పై రామాయణ చిత్రం విడుదలైంది. మన దేశంలో 9000 స్క్రీన్స్‌పై విడుదల కాగా, విదేశాల్లో ఏకంగా 50,000 తెరలపై విడుదలైంది. బాలీవుడ్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని ఓపెనింగ్‌ ఇది. రెండు పార్ట్‌లలో భాగంగా తొలి పార్ట్‌ ఇవాళ విడుదలైంది. అపుడు ఈ సినిమాపై రివ్యూలు కూడా వచ్చేశాయి. ఇంత భారీ సినిమాపై డివైడ్‌ టాక్‌ రావడం బాలీవుడ్‌లో ఆందోళన కల్గిస్తోంది. ప్రముఖ రివ్యూలు మాత్రం నెగిటివ్‌గా వచ్చాయి. సాధారణ జనం నుంచి మాత్రం రివ్యూలు మరోలా ఉన్నాయి. చాలా మంది కథ చాలా స్లోగా నడుస్తోందని, మ్యూజిక్‌ చాలా డల్‌గా, క్లాస్‌ మార్క్‌లో ఉందని, దీంతో గూస్‌బమ్స్‌ వచ్చే సీన్‌ ఒక్కటీ లేదని అంటున్నారు. ముఖ్యంగా హనుమంతుని క్యారెక్టర్‌ రెండో పార్ట్‌ కోసం దాచారని అంటున్నారు. అంటే ఇవాళ విడుదలైన సినిమాలో హనుమంతుని కేరక్టర్‌ లేదని తేలిపోయింది. ఇక క్యారెక్టర్స్‌ క్యాస్టింగ్‌ విషయమై కూడా డివైడ్‌ టాక్‌ వస్తోంది. అయితే ఫస్ట్‌ షో మాత్రమే… మున్ముందు టాక్‌ ఎలా వస్తుందో చూడాలి. దక్షిణాది వారికి ముఖ్యంగా ఎన్టీఆర్‌ను రామునిగా చూసినవారికి ఈ సినిమా నచ్చుతుందా అన్నది అనుమానంగా మారింది. సినిమాలో రావణుడు (రావణ్‌) క్యారెక్టర్‌ రాముడు (రణబీర్‌ కపూర్‌)ను మింగేసిందని మెజారిటీ ఆడియన్స్‌ అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో మ్యూజిక్‌ ఏమాత్రం బాగా లేదని కూడా టాక్‌.
బిజినెస్‌ సంగతి
ఈ సినిమా నిర్మాణానికి రూ. 2000 కోట్లు ఖర్చు చేసినట్లు నిర్మాతలు అంటున్నారు. అదే మీడియాలో వస్తోంది. ఇప్పటి వరకు డిజిటల్‌, మ్యూజిక్‌ రైట్స్‌ను మాత్రమే అన్నారు. మ్యూజిక్‌ కోసం టీ సిరీస్‌ రూ. 75 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది రెండు పార్ట్‌లకు కలిపి. అలాగే రిలయన్స్‌ జియోతో కుదిరిన ఒప్పందం కూడా. డిజిటల్‌, ఓటీటీ హక్కులను ఈ కంపెనీ కొంది. దీని కోసం రూ. 450 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు జియో ట్విస్ట్‌ పెట్టింది. సాధారణంగా సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవారికి సినిమా ఖర్చు లేకుండా చూడొచ్చు. అయితే రామయణ్‌ను మాత్రం పే పర్‌ క్లిక్‌ పద్ధతిలో రిలీజ్‌ చేయనుంది. అంటే ప్రత్యేకంగా డబ్బు చెల్లిస్తేనే చూడొచ్చన్నమాట. ఈ బిజినెస్‌ పూర్తిగా ఇపుడు వచ్చే టాక్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఇక గత అయిదు రోజులుగా ఈ సినిమాకు అడ్వాన్స్‌ రూపంగా దేశంలో రూ. 100 కోట్లు వచ్చినట్లు లెక్క. విదేశాలకు సంబంధించి ఇంకా వివరాలు రాలేదు.
రూ. 4000 కోట్లు వస్తేనే?
సినిమా నిర్మాణంలో ఇప్పటి వరకు కేవలం రూ. 500 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1500 కోట్లు నెట్‌ వస్తేనే నిర్మాత గట్టెక్కుతాడు. అయితే ఈ మాత్రం నెట్‌ రావాలంటే గ్రాస్‌ కలెక్షన్స్‌ రూ. 3000 కోట్ల నుంచి రూ.4000 కోట్ల లోపు ఉండాలని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. రెంటల్స్‌, ట్యాక్స్‌, కమీషన్‌ చెల్లించని తరవాత కనీసం రూ. 1500 కోట్లు రావాల్సి ఉందని తెలిపాయి. తొలి రోజు టికెట్లు రూ. 150 నుంచి రూ. 3175 మధ్య అమ్మినట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ ఉన్నందున వారాంతం వరకు బాక్సాఫీస్‌ ఫుల్‌ అవ్వాల్సిందే. లేదంటే ఇబ్బందులు తప్పవు. అయితే దీనికి తొలి రోజు టాక్‌ చాలా ముఖ్యంగా. రొటీన్‌కు భిన్నంగా ఈ సినిమాను గురువారమే రిలీజ్‌ చేశారు. అంటే నాలుగు రోజులు కలెక్షన్ల సునామీ ఉండాలి. తొలి భాగం హిట్‌ టాక్ వస్తేనే… రెండో భాగంపై ఆసక్తి ఉంటుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. పైగా ఇవాళ విడుదలైన తొలి భాగానికి ఇతర సినిమాలు లేకుండా నిర్మాతలు మేనేజ్‌ చేశారు. హిట్‌ టాక్‌ రాకపోతే రెండో పార్ట్‌కు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఇపుడు రామాయణ్‌ హిట్‌ కావడం నిర్మాతకు చాలా ముఖ్యం.

Leave a Reply