For Money

Business News

నష్టాల నుంచి లాభాల్లోకి…

జీడీపీ డేటా నిరుత్సాహకరంగా ఉండటంతో స్వల్ప నష్టాలతో మొదలైన వాల్‌స్ట్రీట్‌ వెంటనే లాభాల్లోకి వచ్చేసింది. ముఖ్యంగా డౌజోన్స్‌ దాదాపు అర శాతం లాభపడింది. ఆల్ఫాబెట్‌ ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటంతో టెక్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది. నాస్‌డాక్‌తో పాటు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. మూడో త్రైమాసికంలో అమెరికా జీడీపీ వృద్ది రేటు 2.8 శాతంగా నమోదు అయింది. ఆర్థిక వేత్తల అంచనాకు సమానంగా ఈ వృద్ధి రేటు లేకున్నా… ద్రవ్యోల్బణం తగ్గుతోందన్న సంకేతాలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ స్వల్పంగా తగ్గి 104 దిగువకు వచ్చింది. ఫలితంగా క్రూడ్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 72 డాలర్ల వద్ద ఉంది. ఇక బులియన్‌ మార్కెట్‌లో మిశ్రమ ధోరణి వ్యక్తమైంది. వెండి ఒక శాతం క్షీణించగా… బంగారం స్వల్పంగా పెరిగింది. ఔన్స్‌బంగారం ధర మెలమెల్లగా 2800 డాలర్లకు చేరువౌతోంది.

Leave a Reply