For Money

Business News

డీబీ రియాల్టిలో రాకేష్‌ కంపెనీకి వాటా

తమ కంపెనీలో వాటా తీసుకునేందుకు ఆసక్తి చూపిన గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ డీల్‌ నుంచి వెనక్కి పోవడంతో డీబీ రియాల్టి ఇవాళ ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేస్‌ ఝున్‌ఝున్‌వాలా ఫ్యామిలీకి చెందిన కంపెనీతో పాటు పలు నాన్‌ ప్రమోటర్లకు షేర్లను కేటాయించనుంది. ఈ మేరకు ప్రతిపాదనకు ఇవాళ జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ ఈ కంపెనీలో కోటి షేర్లను తీసుకోనుంది. అలాగే ఆయన భార్య కూడా కోటీ షేర్లను తీసుకుంటున్నారు. వీరి పాటు నాన్‌ ప్రమోటర్ల కోటా కింద బార్క్‌లేస్‌ వెల్త్‌ ట్రస్ట్‌, లోటస్‌ ఫ్యామిలీ ట్రస్ట్‌లతో పాటు మరికొందరు వాటాదారులకు ప్రిఫెర్షియల్‌ పద్ధతిలో వారెంట్లను జారీ చేయనున్నారు. వీరందరికీ 5 కోట్ల వారెంట్లను జారీ చేస్తారు. ఈ వారెంట్లను కనీసం18 నెలల్లో సమాన సంఖ్యలో షేర్లను కేటాయిస్తారు. వీరితో పాటు 7.7 కోట్ల వారెంట్లను కంపెనీ ప్రమోటర్లకు కూడా జారీ చేయనుంది. దీంతో మొత్తం వారెంట్ల సంఖ్య 12.7 కోట్లు అవుతాయి. ఈ అలాట్‌ మెంట్‌ తరవాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 54.08 శాతానికి చేరుతుంది. అలాగే పినకల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ వాటా 17.97 శాతం అవుతుంది. కంపెనీ తాజా నిర్ణయంతో డీబీ రియాల్టి షేర్‌ మార్కెట్‌లో ఇవాళ 5 శాతం పెరిగింది.