తెలంగాణలో రూ. 24000 కోట్ల పెట్టుబడి
అత్యాధునిక అమొలెడ్ డిస్‌ప్లేల తయారీకి డిస్‌ప్లే ఫ్యాబ్ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని రాజేష్ ఎక్స్‌పోర్ట్ నిర్ణయించింది. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్ ఈ ప్లాంట్‌ను నెలకొల్పుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు బ్యాటరీ సెల్స్, సెమికండక్టర్ డిస్‌ప్లే ఫ్యాబ్స్‌ను ఈ ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఈ ప్రాజెక్టుపై కంపెనీ రూ. 24000 కోట్ల పెట్టబడి పెడుతుంది. వచ్చే ఏడేళ్ళలో రూ. 50,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని రాజేష్ ఎక్స్‌పోర్ట్ భావిస్తోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వం, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ మధ్య ఎంఓయూ కుదిరింది. రానున్న 12 లేదా 18 నెలల్లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తన సొంత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తెస్తోంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అత్యాధునిక ప్లాంట్‌ను తమ రాష్ట్రంలో పెట్టడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హై టెక్ తయారీ రంగంలో ఇది అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటని ఆయన అన్నారు. ఈ తరహా ఫ్యాబ్ డిస్‌ప్లేలను తయారు చేసే జపాన్, కొరియా, తైవాన్ దేశాల సరసన తెలంగాణ చేరిందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి టీవీ, స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ మేకర్స్‌కు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయని ఆయన అన్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కూడా ఈ పెట్టుబడి పెట్టే ముందు పలు రాష్ట్రాలతో చర్చలు జరిపింది. చివరికి తెలంగాణను ఎంపిక చేసింది.