మార్గదర్శితో సహా చిట్ ఫండ్ కంపెనీలలో తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ ఇవాళ మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ సోదాలు అసలు ఉద్దేశం మార్గదర్శిని టార్గెట్ చేశారనే అపవాదు రాకుండా ఉండేందుకు ఇతర సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఈ సోదాల గురించి రాస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదు కారణంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు రాసింది. మార్గదర్శి సంస్థపై ఉండవల్లి వేసిన పిటీషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఉండవల్లి వేసిన పిటీషన్‌లో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు మరోసారి విచారణకు వస్తున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం విశేషం.