23న రేడియంట్ క్యాష్ ఐపీఓ..
రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఆఫర్ ఈనెల 23న ప్రారంభమై 27న ముగియనుంది. ఆఫర్ ధరల శ్రేణిని రూ.94- 99గా నిర్ణయించింది. ఈ లెక్కన కంపెనీ గరిష్ఠ ధర వద్ద షేర్లను కేటాయించే పక్షంలో రూ.388 కోట్లు సమీకరించే వీలు ఉంది. రూ.60 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 3.31 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయించనున్నారు. అంటే ఇపుడున్న ప్రమోటర్లు/ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లలో కొంత భాగాన్ని ఈ ఆఫర్ ద్వారా అమ్ముతున్నారన్నమాట. 2015లో రేడియంట్ క్యాష్లో ‘అసెంట్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఇండియా’ 37.2 శాతం వాటా కోనుగోలు చేసింది. దీంట్లో ఇప్పుడు కొంత భాగాన్ని ఓఎఫ్ఎస్ కింద అసెంట్ అమ్మనుంది. అలాగే ప్రమోటర్ డేవిడ్ దేవసహాయం కూడా కొన్ని షేర్లను ఈ పబ్లిక్ ఆఫర్లో విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 150 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంది.