For Money

Business News

జబర్దస్త్‌ రికవరీ…

నిఫ్టి సరిగ్గా డేంజర్‌ జోన్‌ను టచ్‌ చేసి నష్టాలను రికవర్‌ చేసుకుంటూ 18400ను దాటింది. మిడ్‌సెషన్‌ వరకు కొనసాగిన అమ్మకాల జోరు 18200 ప్రాంతంలోఆగింది. 18202ను తాకిన తరవాత నిఫ్టి రికవర్‌ కావడం ప్రారంభమైంది. ఉదయం నష్టాల్లో ఉన్న చాలా నిఫ్టి షేర్లు క్రమంగా కోలుకుని ఆకర్షణీయ లాభాల్లోకి వచ్చాయి. 18200, 18300 పుట్‌ రైటింగ్‌ జోరుగా ఉండటంతో నిఫ్టి మిడ్ సెషన్‌ తరవాత భారీగా కోలుకుంది. క్రితం స్థాయి నుంచి దాదాపు 200 పాయిట్లకు పైగా లాభపడింది. 18404ను తాకిన తరవాత 18385 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 35 పాయింట్లు పెరిగింది. ఇవాళ పలు మద్దతు స్థాయిలను కోల్పోతూ… చివరి మద్దతు స్థాయిలో కోలుకోవడం విశేషం. యూరో మార్కెట్‌ నష్టాలు స్వల్పంగా ఉండటంతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌ నుంచి గ్రీన్‌లోకి మారడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. నిఫ్టితో పాటు ఇతర ప్రధాన సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇవాళ నిఫ్టి అదానీ, టీసీఎస్‌, రిలయన్స్‌ టాప్‌ గెయినర్స్‌లో ముందున్నాయి. ప్రధాన ఆటో షేర్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఇండిగో, జొమాట, ఎంఫసిస్‌ షేర్లతో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఇవాళ ఒక శాతంపైగా లాభంతో ముగిశాయి. మిడ్‌ క్యాప్‌లోనే చాలా వరకు ప్రధాన షేర్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇక నిఫ్టి బ్యాంక్‌ మళ్ళీ మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లకు మద్దతు అందింది. ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ రూ. 754కి చేరినా.. రూ.740 వద్ద ముగిసింది.పలు లోకల్‌ ఫార్మా షేర్లు వీక్‌గా ముగిసినా… దివీస్‌ ల్యాబ్‌ భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిసింది. ఒకదశలో ఈ షేర్‌ రూ. 3308కి చేరినా.. తరవాత కోలుకుని రూ. 3355ని తాకింది.