52 వారాల కనిష్ఠ స్థాయికి…
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల తరవాత లారస్ ల్యాబ్ షేర్ వచ్చిన కరెక్షన్ ఇంకా కొనసాగుతోంది. గత ఏప్రిల్ 19న రూ. 626ని తాకిన ఈ షేర్ ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 375.60ని తాకింది. నిఫ్టి ఇవాళ దాదాపు ఒక శాతంపైగా నష్టపోయింది. మొత్తం ఫార్మా కౌంటర్లలో ఇవాళ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇవాళ రూ.375ని తాకినా వెంటనే కోలుకుని ఇపుడు రూ. 382.50 వద్ద ట్రేడవుతోంది. అలాగే అరబిందో షేర్ కూడా భారీగా క్షీణించింది. గత జనవరిలో రూ. 742 పలికి ఈ షేర్ ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 434.45ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని రూ. 436.20 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను ఇప్పటికీ అమ్మాల్సిందిగా పలువురు రెకమెండ్ చేస్తున్నారు.